-->
Andhra Pradesh: అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు.. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్

Andhra Pradesh: అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు.. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్

Gold Deposits

ఏపీలోని  అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నాయట. ఇది మేము చెబుతున్న మాట కాదు. గనుల శాఖ నిర్ధారించింది.  రాష్ట్ర గనులశాఖ పరిధిలో ఉండే ఖనిజాన్వేషణ విభాగం ఈ నిక్షేపాలపై అధ్యయనం చేసి అనంతపురం జిల్లాలో 10 చోట్ల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. మండల కేంద్రం రామగిరిలో గతంలో భారత్‌ గోల్డ్‌మైన్స్‌ లిమిటెడ్‌ (బీజీఎంఎల్‌) గనులు ఉండేవి. వీటిలో 2001 నుంచి తవ్వకాలు ఆపివేశారు. ఇప్పుడు దీనికి దగ్గర్లోని 2 ప్రాంతాల్లో, రొద్దం మండలం బొక్సంపల్లిలో రెండుచోట్ల, కదిరి మండలం జౌకుల పరిధిలో ఆరుచోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పది ప్రాంతాల్లోని 97.4 చదరపు కి.మీ. పరిధిలో నిక్షేపాలు ఉన్నాయి.

గుర్తించిన ప్రాంతాల్లో భూమి లోపలికి 50 మీటర్ల నుంచి మరింత దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్ ఉంటుంది. అత్యధికంగా జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలోని రెండు టన్నులు కలిపి మొత్తంగా 16 టన్నులు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. భూగర్భ గనులుగా ఇక్కడ తవ్వకాలు చేపట్టేందుకు వీలుంటుందని అధికారులు వెల్లడించారు. మార్కెట్‌లో ప్రస్తుతమున్న బంగారం ధరలను బట్టి ఈ ప్రాంతాల్లో గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు.

రాష్ట్రంలో తొమ్మిది చోట్ల గోల్డ్‌, వజ్రాలు, బేస్‌ మెటల్‌, కాపర్‌,  మాంగనీస్‌, ఇనుప ఖనిజ బ్లాక్‌లను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) గుర్తించింది. ఇటీవల వీటిని రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది. ఈ ఏరియాల్లో మరింత ఖనిజాన్వేషణ చేసేందుకు వీలుగా కాంపోజిట్‌ లైసెన్సు ఇవ్వనున్నారు. వీటితోపాటు రాష్ట్ర గనులశాఖ గుర్తించిన 10 బంగారు నిక్షేపాల ప్రాంతాలకు కూడా కాంపోజిట్‌ లైసెన్సు ఇవ్వాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఒక్కో వ్యక్తి లేక సంస్థకు వెయ్యి హెక్టార్ల వరకు ఈ లైసెన్సు ఇచ్చే వీలు ఉంటుంది. ఆ ఏరియాలో ఖనిజ నిల్వలపై మరింత ఫోకస్ పెట్టి.. అన్వేషణ చేసుకోవాలి. పూర్తిస్థాయిలో ఖనిజ నిక్షేపాలు గుర్తించిన చోట మైనింగ్‌ లీజు కేటాయిస్తారు. కాంపోజిట్‌ లైసెన్సు జారీకి త్వరలో ఈ-వేలం నిర్వహిస్తామని గనులశాఖ అధికారులు తెలిపారు.

Also Read: వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరికొట్టిన వధువు

ఆకాశం నుంచి పడిన ఉల్క.. పోలంలో చూసి షాకైన రైతు.. ఆ తర్వాత భయంతో..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zJguBw

Related Posts

0 Response to "Andhra Pradesh: అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు.. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel