-->
RRR Pre Invite Poster: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.. నెట్టింట్లో పంచుకున్న తరణ్ ఆదర్స్..!

RRR Pre Invite Poster: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.. నెట్టింట్లో పంచుకున్న తరణ్ ఆదర్స్..!

Rajamouli Rrr

RRR Pre Invite Poster: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. స్టార్స్ అంతా సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్, ఫొటోస్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి, అభిమానులు ఈ చిత్రం థియేటర్లలో విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్‌లో ‘RRR’ ప్రీ-ఈవెంట్ పోస్టర్‌ను పంచుకున్నారు.

ఈ పోస్టర్‌ను పంచుకుంటూ, “దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తిరువనంతపురం చేరుకున్నారు. ఈ ఈవెంట్ పోస్టర్‌లో నటీనటులందరినీ చూపించారు. ఈ పోస్టర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ఆరు పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లకు స్థానం కల్పించారు. జనవరి 7న సినిమా థియేటర్లలో విడుదల కానుంది’ అని అందులో రాసుకొచ్చాడు.

ఆర్ఆర్ఆర్ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కథ..
‘ఆర్‌ఆర్‌ఆర్’ ‘స్టోరీ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ కల్పిత కథ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన యాక్షన్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

ఆర్‌ఆర్‌ఆర్ విడుదలకు ముందు, మేకర్స్ సినిమా ప్రేక్షకుల కోసం ఒక మెగా ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో సల్మాన్‌ఖాన్‌ ప్రత్యేక అతిథిగా కనిపించనున్నట్టు సమాచారం. దీంతో పాటు ప్రేక్షకులతో చాట్ సెషన్ కూడా చేయనున్నారు. రీసెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ బిగ్ బాస్ 15లో వీకెండ్ క‌వార్‌లో సినిమా ప్ర‌మోష‌న్ కోసం సందడి చేసింది. షో హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో టీమ్ చాలా సరదాగా గడిపింది.

Also Read: Spider-Man: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లు.. ఏ సినిమా ఎంత కలెక్షన్ కొల్లగొట్టిందంటే..

Vijay Devarakonda’s Liger : కథల్లోనే కాదు పూరీ టైటిల్స్‌లో కూడా పవర్ ఉంటుంది.. లైగర్ టైటిల్ వెనుక సీక్రెట్ ఇదే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EAf8LY

0 Response to "RRR Pre Invite Poster: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.. నెట్టింట్లో పంచుకున్న తరణ్ ఆదర్స్..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel