-->
WhatsApp : అదిరిపోయే ఆఫర్‌..! రూ. ఒక్క రూపాయి పంపించినా.. రూ. 50క్యాష్‌ బ్యాక్‌.! (వీడియో)

WhatsApp : అదిరిపోయే ఆఫర్‌..! రూ. ఒక్క రూపాయి పంపించినా.. రూ. 50క్యాష్‌ బ్యాక్‌.! (వీడియో)

Whatsapp New Upcomeing Features Video


వాట్సాప్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.? అయితే మీకోసమే అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది వాట్సాప్‌ సంస్థ. డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తే క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్లు తెలిపింది. గత కొద్ది రోజుల క్రితమే.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్స్ సేవలను ప్రారంభించింది. అయితే ఎక్కువ మంది వినియోగదారులను తమ వైపు ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకువచ్చింది వాట్సాప్.

నగదు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 51 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే కేవలం ఒక రూపాయి పంపించినా కూడా క్యాష్ బ్యాక్ లభించడం విశేషం. అయితే.. ఈ ఆఫర్ ఐదు ట్రాన్సాక్షన్ల వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది వాట్సాప్‌ సంస్థ. డబ్బులు పంపించిన వెంటనే ఆ క్యాష్ బ్యాక్ మన ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ క్యాష్ బ్యాక్ సదుపాయం అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.గతంలో ఫోన్ పే, గూగుల్ పే సైతం మొబైల్ పేమెంట్స్ ప్రారంభించిన సమయంలో క్యాష్ బ్యాక్ అందించాయి. దీంతో అవి వినియోగదారులను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ సైతం ఆ వినియోగదారులను తన వైపు తిప్పుకునేందుకు అదే దారిలో వెళ్తోంది.

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2ZYD9hv

Related Posts

0 Response to "WhatsApp : అదిరిపోయే ఆఫర్‌..! రూ. ఒక్క రూపాయి పంపించినా.. రూ. 50క్యాష్‌ బ్యాక్‌.! (వీడియో)"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel