
Watch Video: తిరుమల బైపాస్‌లో జనంపైకి దూసుకెళ్లిన కారు.. కొనుగోలు చేసి తీసుకొస్తుండగా.. వీడియో

Car Crashed at Tirupati: కొత్త కారు కొనుగోలు చేసి అప్పుడే.. ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు టైరు పేలి.. ఒక్కసారిగా అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. తృటిలో ప్రాణపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఏపీలోని తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి అక్కారంపల్లికి చెందిన లక్ష్మీనరసింహ ఓ కొత్త కారును కొనుగోలు చేశాడు. అనంతరం ఆ కారును షోరూం నుంచి లీలామహల్ వైపున్న తన నివాసానికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక ఎస్కే ఫాస్ట్ఫుడ్స్ వద్ద కొత్త కారు టైరు పేలి ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనున్న జనాలు, వాహనాలపైకి కారు దూసుకెళ్లింది. అయితే.. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు.
కాగా.. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. ఆరు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కారులోని వ్యక్తి తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం గురించి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వీడియో..
Also Read:
Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. కొన్ని ప్రాంతాల్లో పెరిగితే.. మరి కొన్ని చోట్ల తగ్గింది.. ఎక్కడెక్కడ అంటే..
Private Travels: నల్గొండలో ప్రయాణికులకు షాక్.. లగేజీలతో పరారైన బస్సు డ్రైవర్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2YolMpu
0 Response to "Watch Video: తిరుమల బైపాస్‌లో జనంపైకి దూసుకెళ్లిన కారు.. కొనుగోలు చేసి తీసుకొస్తుండగా.. వీడియో"
Post a Comment