-->
Shyam Singha Roy: మీకు తెలుసా శ్యామ్ సింగరాయ్ సినిమాలో ముందుగా ఆహీరోను అనుకున్నారట.. కానీ..

Shyam Singha Roy: మీకు తెలుసా శ్యామ్ సింగరాయ్ సినిమాలో ముందుగా ఆహీరోను అనుకున్నారట.. కానీ..

Nani

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని త్వరలో శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నాని నటించిన వి, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయాయి. దాంతో ఇప్పుడు నాని అభిమానులంతా శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తుంది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో ముందుగా నాని ని హీరోగా అనుకోలేదట.. నాని కంటే ముందు ఈ సినిమాలో రానా ను హీరోగా అనుకున్నారట. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ‘శ్యామ్ సింగ రాయ్’ లో హీరోగా రానా దగ్గుబాటి ని అనుకున్నారట.  సినిమా స్క్రిప్ట్ ను ముందుగా రానా కు వినిపించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారట. అంతే కాకుండా ఈ స్టోరీ నానికి సెట్ అవుతుందని రానానే సలహా ఇచ్చారట.. ఆతర్వాత నాని ఈ కథ వినడం ఆయనకు బాగా నచ్చడంతో సినిమా పట్టాలపైకి వెళ్ళిందట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AP Film Exhibitors: మంత్రి పేర్ని నానితో ముగిసిన సినీ ఎగ్జిబిట‌ర్ల సమావేశం.. ఆన్‌లైన్ టికెట్ విధానానికి అంగీకారం

RRR Movie Song: నాటు సాంగ్‌కు సెలబ్రెటీలు ఫిదా.. మెంటలెక్కిందన్న సమంత, వెయిట్ చేయలేనంటున్న సిద్ధార్ద్..

Rakul Preet Singh: డిఫరెంట్ లుక్స్ తో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3cgvGwR

0 Response to "Shyam Singha Roy: మీకు తెలుసా శ్యామ్ సింగరాయ్ సినిమాలో ముందుగా ఆహీరోను అనుకున్నారట.. కానీ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel