-->
Neena Gupta: పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే మస్కారా పెట్టుకోవద్దు.. నీనా ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Neena Gupta: పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే మస్కారా పెట్టుకోవద్దు.. నీనా ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

నీనా గుప్తా .. హిందీ సినిమాలు చూసేవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. 80వ దశకంలో తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారీ అందాల తార. ఇప్పుడు కూడా ‘బదాయి హో’, ‘పంగా’, ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’ వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ హిందీ సినిమా ప్రియులను అలరిస్తున్నారు. అయితే వృత్తిగత జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన నీనా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో ప్రేమాయణం సాగించిన ఆమె పెళ్లి కాకుండానే గర్భం ధరించారు. మసాబాకు జన్మనిచ్చారు. అయితే ఆతర్వాత రిచర్డ్స్‌తో విడిపోయారు. దీంతో సింగిల్‌ పేరెంట్‌గానే మసాబాను పోషించారు.

కన్నీళ్లే మిగులుతాయి..
సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నీనా తన వ్యక్తిగత జీవితం గురించి అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్‌ చేశారు. ‘మీరు పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే ఎప్పుడూ మస్కారా పెట్టుకోకండి. నేనేం చెబుతున్నానో మీకు అర్థమవుతోందా? అసలు నేను ఎందుకు ఇలా చెబుతున్నానో మీరు అనుభవిస్తే తప్ప తెలియదు’ అంటూ పరోక్షంగా రిచర్డ్స్‌ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఎందుకంటే నీనా రిచర్డ్స్‌తో ప్రేమలో పడే నాటికే అతనికి వివాహమైంది. ఈ పోస్టుపై స్పందిస్తోన్న నెటిజన్లు ‘పెళ్లైన మగాళ్లను ప్రేమిస్తే కన్నీళ్లే మిగులుతాయి’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta)

Also read:

Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎంటర్‏టైన్‏మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Vijay Sethupathi: ఎయిర్‏పోర్ట్‏లో విజయ్ సేతుపతికి చేదు అనుభవం.. ఎగిరి తన్నిన యువకుడు..

Samantha: బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సమంత.. ఆ స్టార్ హీరోయిన్‏తో కలిసి సామ్ భారీ ప్రాజెక్ట్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GOoGoY

Related Posts

0 Response to "Neena Gupta: పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే మస్కారా పెట్టుకోవద్దు.. నీనా ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel