-->
Hospital Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి

Hospital Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి

Fire Accident

Four children die as fire breaks: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన నుంచి 36 మంది చిన్నారులు ప్రాణాలతో సురక్షితంగా బయటడినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయని, మంటలను ఆర్పేందుకు దాదాపు 10 ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ఫతేఘర్ అగ్నిమాపక కేంద్రం ఇన్‌ఛార్జ్ జుబేర్ ఖాన్ వెల్లడించారు. మూడో అంతస్థులో మంటలు చెలరేగడంతోనే.. చిన్నారుల తల్లిదండ్రులు వారి వారి పిల్లలను తీసుకొని పరుగులు తీశారని తెలిపారు.

Also Read:

Crime News: కొడుకు మాటలు నమ్మి భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. నేరుగా స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసుల షాక్!

Crime news: ఆ ఇంట్లో నాలుగు మృతదేహాలు.. హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా.. అసలు ఏం జరిగింది..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3wrBXPt

Related Posts

0 Response to "Hospital Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel