-->
Amarnath Reddy: కుప్పంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు..

Amarnath Reddy: కుప్పంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు..

Tdp

చిత్తరు జిల్లాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.  మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్నాథ్ రెడ్డితోపాటు.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ లో బస చేస్తుండగా అరెస్ట్ చేశారు పోలీసులు.  కుప్పంలో నామినేషన్స్ సందర్భంగా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మొత్తం 19 మంది పై పోలీసులు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇందులో ఇద్దరినీ మాత్రమే అదుపులోకి తీసుకున్నారు.

ఐపీసీ 143, 147,353, 427,149 సెక్షన్స్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయమే డీఎస్పీ కూడా నామినేషన్ వివాదం పై మీడియాతో మాట్లాడారు. ఇతర జిల్లాలవారి కారణంగానే గొడవలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమీషనర్  చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అమర్నాథ్ రెడ్డిని, పులివర్తి నానిని అరెస్ట్ చేశారు. దాంతో పోలీస్ స్టేషన్ ముందు తెలుగుదేశం కార్యకర్తలు గందరగోళం సృష్టిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

cholesterol: మీరు కొలెస్ట్రాల్‎తో బాధపడుతున్నారా.. అయితే ఇవి పాటించండి..

Corona: మిలియన్ల మంది ప్రాణాలను బలిగొన్న కరోనా ఆ ఖైదీ ప్రాణాన్ని కాపాడింది.. ఎలాగంటే..

 

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3qmwHf1

0 Response to "Amarnath Reddy: కుప్పంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel