-->
Snake fly : అమ్మ బాబోయ్.. ఆకాశం నుంచి పడిన భారీ పాము.. అది చూసిన జనాలు ఏం చేశారంటే..

Snake fly : అమ్మ బాబోయ్.. ఆకాశం నుంచి పడిన భారీ పాము.. అది చూసిన జనాలు ఏం చేశారంటే..

Snake

Snake fly : సాధారణంగా పాములు భూమిపై నివసిస్తాయి. కొన్ని నీటిలో నివసించేవి కూడా ఉంటాయనుకోండి. అయితే, ఆ మధ్య కాలంలో ఆకాశం నుంచి కప్పలు, చేపలు రాలి పడటం గురించి విన్నాం.. చూశాం. కానీ, ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి పాము కూడా చేరింది. అవును ఆకాశం నుంచి ఓ భారీ పాము వచ్చి జనం మధ్యలో పడింది. దీనికి సంబంధించి భయానకమైన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

నిజానికి ఈ పాము ఆకాశం నుంచి పడలేదు. కానీ ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వినియోగదారుడు.. ఆసక్తికరంగా ఉండాలని ‘‘ఓ భారీ పాము ఆకాశం నుంచి పడింది.. అది నా పీడకల’’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో పాము నిజమే, మనుషులు నిజమే. వీడియో కూడా నిజమే. కానీ ఆ పాము రోడ్డుపైన వేలాడుతూ ఉన్న వైరుకు చుట్టుకుని ఉంది. ఆకాశం నుంచి రాలి పడలేదు. కొంత సేపు అలా ఉన్న తర్వాత దాని పట్టు జారడంతో రోడ్డుపైన పడింది. అంతవరకూ పాము వైరుకు వేలాడుతూ ఉన్న దృష్యాన్ని తమ సెల్‌ ఫోన్స్‌లో బంధించిన జనం అది కింద పడగానే.. ‘‘వామ్మో పామ’’ అంటూ పరుగులు తీశారు.

నిజానికి అది చాలా పెద్ద పాము. చాలా మంది దాన్ని చూసి షాక్ అయ్యారు. కొంత మంది భయంతో కేకలు కూడా వేశారు. అప్పటికే ఆ పాము గురించి రక్షణ సిబ్బందికి సమాచారం అందడంతో వారు వచ్చి పామును పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే చీకట్లో పడ్డ ఆ పాము అంత పెద్దగా ఉంది అంటే.. అది భారీ కొండ చిలువ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా.. భారీ పాము జనాల మధ్యలో ఒక్కసారిగా పడటంతో బయపడిపోయారు.

Also read:

Power Lifter: వందేళ్ల వయస్సులోనూ ‘తగ్గేదే లే’ అంటున్న బామ్మ.. చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..

Nature of Earth: భూమిపై మరణం లేని జీవులు కూడా ఉన్నాయని మీకు తెలుసా?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..!

Telangana Fears Tiger: తెలంగాణను బెంబేలెత్తిస్తున్న పెద్ద పులులు.. ఏక కాలంలో రెండు పులుల దాడులు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3jc0rGN

Related Posts

0 Response to "Snake fly : అమ్మ బాబోయ్.. ఆకాశం నుంచి పడిన భారీ పాము.. అది చూసిన జనాలు ఏం చేశారంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel