-->
AP True-up Charges: కరెంటు బిల్లులపై వినియోగదారులకు ఊరట.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

AP True-up Charges: కరెంటు బిల్లులపై వినియోగదారులకు ఊరట.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Ap

AP True-up Charges: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరెంటు బిల్లుల్లో ట్రూ అప్‌ ఛార్జీలకు సంబంధించిన ఆదేశాలు రద్దు అయ్యాయి. వీటి వసూలుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఏపీఈఆర్‌సీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఛార్జీల పెంపు విషయంలో సరైన పద్ధతి పాటించలేదని హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత దీనిపై తుది ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయానికి వచ్చింది. వినియోగదారుల నుంచి రూ.3,666 కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఆగస్టు నెలలో ఈఆర్‌సీ ఆదేశాలు ఇచ్చింది. అయితే 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలకు అయిన అదనపు ఖర్చుల కింద వీటిని వసూలు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబరు నుంచి ఈ ట్రూప్ అప్ ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభం కాగా, ఈ క్రమంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనల ప్రకారం ట్రూ అప్‌ ఛార్జీల విధించే ముందు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, దీనిపై, ప్రజాభిఫ్రాయ సేకరణ జరగలేదని పిటిషన్లలో పేర్కొన్నారు.

దీనిపై కోర్టుల విచారణ జరిగిన తర్వాత ఏపీఈఆర్‌సీ ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించిన ఆదేశాలను ఉపసంహరిస్తున్నట్లు మండలి ఒక ఉత్తర్వులో వెల్లడించింది. ఈ ఉత్తర్వును ఈఆర్‌సీ వెబ్‌సైట్‌లో పొదుపర్చారు. ఈ ట్రూ అప్‌ ఛార్జీలపై ఈ నెల 19న ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్లు ఈఆర్‌సీ పేర్కొంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనుంది.

ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏమిటి?

విద్యుత్‌ సరఫరా చేసే సంస్థలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఆమోదించిన రెవెన్యూ వ్యయం కన్న అధికంగా చేసిన వ్యయాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసుకోడం ట్రూ ఆఫ్‌ ఛార్జీలు అంటారు. విద్యుత్‌ సంస్థలు చేసే ఖర్చు అంటే సిబ్బంది జీతాలు, పంపిణీ నష్టాలు, బొగ్గు కొనుగోలు ఇతర అవసరాలకు చేసే ఖర్చును ఏపీఈఆర్‌సీ ఆమోదిస్తుంది. ఈ ఖర్చును అనుసరించి విద్యుత్ చార్జీలు నిర్ణయించడం జరుగుతుంది. ఏపీఈఆర్‌సీ ఆమోదించిన అంచనాలకు మించి విద్యుత్ సంస్థకు ఖర్చు చేయాల్సి వస్తే .. ఆ అదనపు వ్యయాన్ని ఏటా ట్రూ అప్‌ చార్జీల పేరిట వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవచ్చు. ఎంతో ఎక్కువ ఖర్చయ్యాయని చెబుతున్న విద్యుత్ సంస్థలు ట్రూ అప్‌ ఛార్జీల కింద 8 నెలల్లో రూ.3,660 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించుకున్నాయి. అందుకే గత నెల నుంచే వసూలు ప్రారంభించారు.

ఇవీ కూడా చదవండి:

PM Kisan: కేంద్రం శుభవార్త.. రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఎప్పుడంటే..!

Old Vehicles: వాహనదారులకు కేంద్రం షాకింగ్‌ న్యూస్‌.. పాత వాహనాలపై భారీగా పెరగనున్న చార్జీలు.. ఎప్పటి నుంచి అంటే

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3mBUgN5

Related Posts

0 Response to "AP True-up Charges: కరెంటు బిల్లులపై వినియోగదారులకు ఊరట.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel