-->
Viral Video: రూ.5 లేవన్నందుకు దారుణంగా కొట్టారు.. కస్టమర్‌పై హోటల్‌ యజమాని దాడి.. వీడియో

Viral Video: రూ.5 లేవన్నందుకు దారుణంగా కొట్టారు.. కస్టమర్‌పై హోటల్‌ యజమాని దాడి.. వీడియో

Hotel Owner Beats Up Customer

Hotel owner beats up customer: ఎక్కడైనా హోటల్‌కి వెళ్లి భోజనం చేసిన తర్వాత డబ్బు తక్కువైతే.. కాసేపు యజమానులు వాదిస్తారు. లేకపోతే తెచ్చి ఇవ్వాలంటూ కస్టమర్ల దగ్గరి నుంచి ఏదైనా విలువైన వస్తువులను తీసుకుంటారు. అది బహుశా బిల్లు వందల్లో ఉంటే ఆ పని చేస్తారు. కానీ ఇక్కడ యజమాని.. ఐదు రూపాయల కోసం కస్టమర్‌పై విచక్షణరహితంగా దాడిచేశాడు. కొడుకుతో కలిసి కస్టమర్‌ను దారుణంగా కొట్టాడు. అందరూ చూస్తుండగానే.. కస్టమర్‌ను హోటల్‌ బయటకి తీసుకొచ్చి చితకబాదారు. ఈ సంఘటన ఒడిశాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు.. హోటల్‌ యజమాని, కొడుకుపై కేసు నమోదు చేశారు.

ఒడిశాలోని కియోంఝర్‌ జిల్లాకు చెందిన జితేంద్ర దేహురి అనే వ్యక్తి ఘసీపూర్‌లోని ‘మా’ హోటల్‌కు వెళ్లి ప్లేట్‌ భోజనం చేశాడు. అనంతరం హోటల్‌ యజమాని మధు సాహు.. కస్టమర్‌కు రూ.45 చెల్లించాలని చెప్పాడు. అయితే.. తన వద్ద రూ.40 మాత్రమే ఉన్నాయని, మళ్లీ వచ్చినప్పుడు మిగతా డబ్బులు ఇస్తానని దేహురి వెల్లడించాడు. దీంతో హోటల్‌ యజమాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కస్టమర్‌ను తిట్టాడు. రూ.45 ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అప్పటికే అక్కడికి వచ్చిన తన కుమారుడితో కలిసి మధు సాహు.. కస్టమర్‌ జితేంద్ర దేహురిపై దాడికి పాల్పడ్డాడు.

వీడియో..

అందరూ చూస్తుండగానే.. ఇద్దరూ కలిసి కస్టమర్‌ను దారుణంగా కొట్టారు. అనంతరం బాధితుడు జితేంద్ర దేహురి పోలీసు స్టేషన్‌కు చేరుకుని జరిగినదంతా చెప్పాడు. తనను కొట్టిన యజమాని, అతని కొడుకుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు హోటల్‌ యజమానిని అరెస్టు చేశారు. కాగా.. హోటల్‌ యజమాని కొడుకు సాహు మైనర్‌ కావడంతో అతడి వదిలేసినట్లు పేర్కొంటున్నారు.

Also Read:

Fire Accident: బైక్‌పై వెళుతుండగా అకస్మాత్తుగా మంటలు.. మహిళ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

Bigg Boss 5 Telugu: దమ్ దమ్ చేస్తానంది.. వారం కూడా ఉండలేకపోయింది.. బిగ్‌బాస్‌ తొలి ఎలిమినేషన్‌ ఆమే..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3A641st

0 Response to "Viral Video: రూ.5 లేవన్నందుకు దారుణంగా కొట్టారు.. కస్టమర్‌పై హోటల్‌ యజమాని దాడి.. వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel