-->
Viral News: బాప్‌రే ఇలా చేసిందేంటి?.. టీవీలో కనిపించిన ఆనందంలో ఓ మహిళ ఏకంగా..!

Viral News: బాప్‌రే ఇలా చేసిందేంటి?.. టీవీలో కనిపించిన ఆనందంలో ఓ మహిళ ఏకంగా..!

Girl

Viral News: సీరియస్‌ మ్యాచ్‌లో సిల్లీ పనులు చేస్తూ.. ఇట్టే కెమెరాకు దొరికిపోతుంటారు కొందరు ఫ్యాన్స్‌. ఇక మరికొందరైతే స్టేడియంలో కెమెరా కంట్లో పడేందుకే.. ఫన్‌ క్రియేట్‌ చేస్తుంటారు. ఇక తాజాగా అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. యూఎస్ ఓపెన్‌-2021 మ్యాచ్‌లో మ్యాచ్‌ స్క్రీన్‌పై తాను కనిపించిందన్న ఆనందంలో ఫుల్‌ బీర్‌ను లేపేసింది ఓ చిన్నది.

ఫెలిక్స్ అగర్ అలియాస్సిమ్, రాబర్టో బటిస్టా అగుట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కెమెరామెన్ ఓ మహిళను బిగ్ స్క్రీన్‌పై చూపించాడు. దీంతో ఆమె ఆనందాన్ని ఆపుకోలేక, తన చేతిలోని బీరు మొత్తాన్ని గుటుక్కున మింగేసి సంబరాలు చేసుకుంది. ఇది చూసిన మిగతా ప్రేక్షకులు మ్యాచ్‌ను చూడటం మానేసి ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తూ.. షి ఈజ్‌ ఏ ఛాంప్‌ అంటూ కేకలు వేశారు.

ఇదిలాఉంటే.. యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. 18 ఏళ్ల బ్రిటిష్ భామ ఎమ్మా రడుకాను రికార్డు సృష్టించింది. మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న తొలి క్వాలిఫైర్‌గా, గత 17 ఏళ్లలో అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. గ్రీక్‌ 17వ సీడ్ క్రీడాకారిణి మారియా సక్కారిపై 6-1, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించి ఈ ఘనత అందుకుంది. 2004 వింబుల్డన్‌ను మారియా షరపోవా 17 ఏళ్ల వయసులో సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అత్యంత పిన్నవయస్కురాలైన ఎమ్మా ఫైనల్‌కు చేరుకుంది. గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంటే ఎమ్మాకు మరో రికార్డు దక్కుతుంది.

Also read:

Bullet Vinayakudu: ట్రెండ్ ఫాలో అవుతున్న గణనాథుడు.. కొత్తలుక్‌లో అందరినీ కట్టిపడేస్తున్నాడు..!

Andhra Pradesh: రక్షణగా ఉండాల్సిన పోలీసులే అందినకాడికి దోచుకెళ్లారు.. ఆఖరికి సీసీటీవీకి పట్టుబడి సస్పెండ్ అయ్యారు..

Red Tamarind : ఎరుపు రంగులో చింతకాయలు.. వారి రక్తమే అందుకు కారణమట.. విచిత్ర చెట్టు వివరాలు మీకోసం..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3k0ATxc

Related Posts

0 Response to "Viral News: బాప్‌రే ఇలా చేసిందేంటి?.. టీవీలో కనిపించిన ఆనందంలో ఓ మహిళ ఏకంగా..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel