-->
TV9 Effect: వేటు పడింది.. విచారణ మొదలైంది.. లాల్ స్ట్రీట్ పబ్‌పై చర్యలకు సిద్ధమైన పోలీసులు..

TV9 Effect: వేటు పడింది.. విచారణ మొదలైంది.. లాల్ స్ట్రీట్ పబ్‌పై చర్యలకు సిద్ధమైన పోలీసులు..

Kid In Pub

చిన్నపిల్లను లోపలకు రానిచ్చిన గచ్చిబౌలి పబ్‌ యాజమాన్యంపై కేసు బుక్‌ అయింది. 8 ఏళ్ల పిల్ల అని తెలిసినా చిన్నారిని లోపలకు రానిచ్చారు పబ్‌ మేనేజర్‌. పైగా ఆ పిల్లను తీసుకొచ్చిన పెద్దలు చిన్నారితో కలిసి డ్యాన్స్‌లు వేశారు. ఈ వీడియో ట్విట్టర్‌ ద్వారా వైరల్‌ అయింది. టీవీ9 వరుస కథనాలతో రియాక్ట్‌ అయ్యారు గచ్చిబౌలి పోలీసులు. ఆ పబ్‌ యాజమాన్యంపై కేసు పెట్టారు. ఈ ఆదివారం పబ్‌లో చిన్నారి డ్యాన్స్‌ వేసింది. ఆ వీడియో వైరల్‌ అయింది. ఆ రోజు 14 మంది కుటుంబ సభ్యులు పబ్‌కి వెళ్లారు. చిన్నారిని తీసుకెళ్లి డ్యాన్స్‌ చేశారు. చిన్న పిల్లను లోపలకు అనుమతి ఇచ్చినందుకు కేసు బుక్‌ అయింది.

హైదరాబాద్‌లోని పబ్బులు మరీ ఘోరంగా తయారయ్యాయి. రూల్స్‌ లేవు, జాగ్రత్తలు లేవు. ఓ పక్క థర్డ్‌వేవ్‌ వస్తుంది భద్రం బాబో అని వైద్యులు వార్నింగ్‌ ఇస్తుంటే, అస్సలు భయం లేకుండా నడిపిస్తున్నారు పబ్‌లనూ. నిండా పదేళ్లు కూడా నిండని చిన్నారిని సైతం .. లాల్ స్ట్రీట్ పబ్ అనుమతించారు. రూల్స్‌ ప్రకారం 21 ఏళ్ల కంటే ఎక్కువ ఏజ్‌ వారికే ఎంట్రీ ఛాన్స్‌ ఇవ్వాలి. ఏజ్‌పై ఏమాత్రం డౌట్ వచ్చినా.. ఆథార్, ఇతర ఫ్రూఫ్‌లు చెక్‌ చేయాలి. ఏజ్‌ కన్ఫామ్ అయ్యాలే లోపలికి పంపాలి. కానీ ఎక్కడా ఈ నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవనడానికి తాజాగా జరిగిన సంఘటన ఉదాహరణ.

బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట ఏరియాల్లో దాదాపు 300 వరకు పబ్బులు ఉన్నాయి. చాలా చోట్ల కనీస నిబంధనలు పాటించట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధికారులు సైతం పెద్దగా పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. లాల్ స్ట్రీట్ పబ్‌లోకి పదేళ్ల బాలికను అనుమతించడంపై.. టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది.

టీవీ9 కథనాలకు స్పందించారు గచ్చిబౌలి పోలీసులు. లాల్ స్ట్రీట్ పబ్‌పై విచారణ ప్రారంభించారు పోలీసులు. ప్రాథమిక సమాచారం సేకరించారు. లాల్‌స్ట్రీట్‌ పబ్‌ సీసీ ఫుటేజ్‌ను సేకరించారు పోలీసులు.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు పబ్‌ నిర్వహించినట్టు నిర్ధారణకు వచ్చారు. లాల్ స్ట్రీట్ పబ్ బరి తెగింపుపై సీరియస్‌ అయ్యారు పోలీసులు. లాల్ స్ట్రీట్ పబ్ యాజమాన్యానికి, మేనేజర్‌కు నోటీసులు ఇష్యూ చేశారు. అటు బాలికను పబ్‌కి తీసుకొచ్చినవారి సమాచారం కూడా సేకరిస్తున్నారు.

హైదరాబాద్‌లోని చాలా పబ్బులు ఆఫర్లు ప్రకటించి మరీ కస్టమర్లకు వెల్‌కమ్‌ చెబుతున్నాయి. ప్రభుత్వాలు లిక్కర్‌ హాలిడే డిక్లేర్‌ చేసినా, కాక్‌టైల్‌, మాక్‌టైల్‌ పేరిట మద్యం సరఫరా చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులను సీజి్ చేసి, ఓనర్ల మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. లాల్ స్ట్రీట్ పబ్‌లోకి పదేళ్ల బాలికను అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. కంటిన్యూగా పబ్‌ల్లో అమలవుతున్న కండిషన్స్ పై చెక్‌ చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనతో హైదరాబాద్‌లోని ఇతర పబ్‌ల్లో కూడా.. ఇంకా ఏయే ఉల్లంఘనలు జరుగుతున్నాయ్ అంటూ ఆరా తీస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి:  Pub Culture: అక్కడ రూల్స్.. గీల్స్ జాన్తానై.. పబ్బుల్లో నిబంధనలు గాలికి.. చిన్నారులను కూడా అనుమతిస్తున్న వైనం..

Afghanistan Crisis: పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్లకు వరుస ఎదురుదెబ్బలు.. తాజాగా 350 మంది హతం.. కీలక ప్రకటన చేసిన నార్తర్న్‌ అలయెన్స్‌..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3gP37ck

Related Posts

0 Response to "TV9 Effect: వేటు పడింది.. విచారణ మొదలైంది.. లాల్ స్ట్రీట్ పబ్‌పై చర్యలకు సిద్ధమైన పోలీసులు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel