-->
Shikhar Dhawan Divorces: విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్..!

Shikhar Dhawan Divorces: విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్..!

Dhawan Divorces

Shikhar Dhawan Divorces: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడా?. తొమ్మిదేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేశారా? వీరి విడాకులకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ధావన్ భార్య అయేషా ముఖర్జీ తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌లో ఒక భావోద్వేగ పోస్ట్ రాశారు. విడాకులకు సంబంధించిన అనేక అంశాలు అందులో పేర్కొన్నారు. అయితే, దీనిపై శిఖర్ ధావన్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. కానీ, అయేషా పోస్ట్ చూసిన నెటిజన్లు మాత్రం ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు నిశ్చయానికి వచ్చారు. మరి ధావన్ దీనిపై ఎప్పుడు స్పందిస్తాడో వేచి చూడాలి.

తొమ్మిదేళ్ల వివాహ బంధం..
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ వివాహం చేసుకుని తొమ్మిదేళ్లయింది. 2012 లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ధావన్, అయేషాకు జోరావర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. శిఖర్ కంటే అయేషా 10 సంవత్సరాలు పెద్దది. ధావన్ పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తరువాత 2014లో అయేషా, ధావన్ దంపతులకు కుమార్ జోరావర్ జన్మించాడు. ధావన్, అయేషా వివాహం చేసుకున్నప్పుడు చాలా ప్రశ్నలు తలెత్తాయి. తన కంటే పెద్ద అయినా అయేషాను పెళ్లి చేసుకోవడం పట్ల రకరకాల ప్రచారం జరిగింది. అయితే, ఈ పెళ్లికి ధావన్ తల్లి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అయేషా..
కాగా, గత ఏడాది నుంచి వీరిద్దరూ సఖ్యతగా ఉండటం లేదని, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుందనే వార్తలు గుప్పమన్నాయి. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు. ఈ క్రమంలోనే అయేషా తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ ఖాతా నుంచి శిఖర్ ధావన్ ఫోటోలను పూర్తిగా తొలగించింది. ధావన్ ఇన్‌స్టాలో మాత్రం అయేషా ఫోటోలు ఉండటం విశేషం. ఇకపోతే.. తాజాగా అయేషా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌లో ఇలా రాసింది.. ‘మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు ఎలా అనిపించిందో.. రెండోసారి విడాకులు తీసుకున్నప్పుడు కూడా అంతే భయంకరంగా అనిపిస్తోంది. ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది. నేనేంటో నిరూపించుకోవడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ సమయంలో రెండోసారి కూడా విడాకులు తీసుకోవడం చాలా భయానకంగా అనిపిస్తోంది. విడాకులు అనే పదం ఒక చెత్తం పదం అని భావించాను. కానీ నేను రెండు సార్లు విడాకులు తీసుకున్నాను.’’ అంటూ అయేషా రాసుకొచ్చింది.

Aesha Post:

 

View this post on Instagram

 

A post shared by Aesha Mukerji (@apwithaesha)

 

View this post on Instagram

 

A post shared by Aesha Mukerji (@apwithaesha)

Also read:

Jr NTR : తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..? వీడియో

జయలలిత ఎస్టేట్‌లో, వాచ్‌మాన్‌ హత్య, దోపిడి వ్యవహారంలో మళ్లీ సంచలన విషయాలు.. వీడియో

Viral video: డీజేగా మారిన వధువు..! చిందులేస్తూ సందడి చేసిన పెళ్లి జంట!.. వీడియో



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3yRsGjd

0 Response to "Shikhar Dhawan Divorces: విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel