-->
SBI Offer: మీకు ఈ విషయం తెలుసా?.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. మరో వారం రోజులే గడువు.. పూర్తి వివరాలు మీకోసం..

SBI Offer: మీకు ఈ విషయం తెలుసా?.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. మరో వారం రోజులే గడువు.. పూర్తి వివరాలు మీకోసం..

Sbi Offers

SBI Offer: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక డిపాజిట్ పథకం పేరు SBI ప్లాటినం డిపాజిట్స్. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇది పరిమిత కాల ఆఫర్. సెప్టెంబర్ 14వ తేదీతో ఈ ఆఫర్ ముగియనుంది. 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య ఎఫ్‌డి ఉన్న సాధారణ కస్టమర్‌లకు ఎస్‌బిఐ 2.9 శాతం నుండి 5.4 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఈ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) పొందుతారు. ఈ ధరలు 8 జనవరి, 2021 నుండి అమలులోకి వస్తాయి.

సీనియర్ సిటిజన్స్ కోసం SBI ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్..
సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ ప్రత్యేక డిపాజిట్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్లకు వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాల వ్యవధికి అదనంగా 30 bps వడ్డీ రేటును అందిస్తోంది. ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కింద ఒక సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. ఆ ఎఫ్‌డీకి వర్తించే వడ్డీ రేటు 6.20 శాతంగా ఉంటుంది.

ప్రత్యేక డిపాజిట్ల పథకం ఫీచర్లు..

1. SBI ప్లాటినం డిపాజిట్ల కింద కస్టమర్ 75 రోజులు, 525 రోజులు, 2250 రోజులకు స్థిరమైన డబ్బును పొందవచ్చు.
2. NRE మరియు NRO టర్మ్ డిపాజిట్‌లతో సహా (రూ .2 కోట్ల కంటే తక్కువ) దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్‌లు ఈ పథకాన్ని పొందవచ్చు.

3. కొత్త, పునరుద్ధరణ డిపాజిట్లు కూడా చేయవచ్చు.
4. NRE డిపాజిట్లు 525, 2250 రోజులు మాత్రమే అవకాశం ఉంది.

వడ్డీ రేటు..

1. SBI 75 రోజుల వ్యవధిలో సాధారణ ప్రజలకు 3.90 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. అదే సమయంలో, ప్రత్యేక డిపాజిట్ పథకం కింద ప్లాటినం 75 రోజుల వ్యవధిపై 3.95 శాతం వడ్డీని చెల్లించనుంది.
2. అదే సమయంలో, ప్లాటినంపై 525 రోజులకు 5.10 శాతం వడ్డీని, 2250 రోజులకు 5.55 శాతం చెల్లించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం, బ్యాంక్ 525 రోజులు, 2250 రోజుల వ్యవధిలో సాధారణ ప్రజలకు 5 శాతం, 5.40 శాతం వడ్డీని ఇస్తోంది.
3. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నెలవారీ / త్రైమాసిక వ్యవధిలో చెల్లించబడుతుంది. అలాగే ప్రత్యేక టర్మ్ డిపాజిట్లపై మెచ్యూరిటీపై వడ్డీ రేటు చెల్లించబడుతుంది.
4. వడ్డీ, TDS, ఖాతాదారుడి ఖాతాలో జమ చేయబడుతుంది.
5. టర్మ్/స్పెషల్ టర్మ్ డిపాజిట్‌లకు ప్రీమెచ్యూర్ ఉపసంహరణ వర్తిస్తుంది.

పూర్తి వివరాల కోసం మీకు సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంకును సంప్రదించవచ్చు.

Also read:

Agency Rains: నాన్ స్టాఫ్ వర్షాలు.. వరద బీభత్సం. నడుముల్లోతు నీటితో మన్యంలో పరిస్థితి ఆగమ్యగోచరం

Ashu Reddy: ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి.. ఇంతకీ కారణం ఏంటంటే.?

CM KCR: కేంద్ర జల్ శక్తి మంత్రి షెకావత్ తో సీఎం కేసీఆర్ భేటీ.. కృష్ణా గోదావరి నదీ జలాలపై కీలక చర్చ



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2VoFAaO

0 Response to "SBI Offer: మీకు ఈ విషయం తెలుసా?.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. మరో వారం రోజులే గడువు.. పూర్తి వివరాలు మీకోసం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel