
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. అభిమాన హీరోను బుల్లి తెరపై చూసుకునే చాన్స్..

Prabhas: ప్రభాస్.. ఇప్పుడీ పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఓ స్థాయిలో పెరిగిపోయింది. నేషనల్ హీరో స్థాయిని దాటేసి ఇంటర్నేషనల్ హీరోగా మారారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా తీయాలంటే కనీసంలో కనీసం నిర్మాతలు రూ. 300 కోట్లు పెట్టాల్సిందే. ఆయనకు ఉన్న మార్కెట్ అలాంటిది. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సినిమాలే దీనికి ఉదాహరణ.
ఇక ఇంతటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ చాలా లో ప్రొఫైల్‌గా ఉంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా మీడియాకు కనిపించకుండా కేవలం సినిమాల ద్వారానే అభిమానులకు చేరువవుతుంటారు ప్రభాస్. ఇక ప్రభాస్ బుల్లి తెరపై కనిపించిన సందర్భాలు చాలా తక్కువేనని చెప్పాలి. సినిమా విడుదలకు ముందు యూట్యూబ్ చానళ్లకు తప్ప.. పెద్దగా బుల్లి తెరపై డార్లింగ్ కనిపించరు. అయితే తాజాగా ఆ లోటు తీరనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో ప్రభాస్ అతిథిగా హాజరుకానున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివలు గెస్ట్‌లుగా హాజరైన విషయం తెలిసిందే. అయితే దసరాకు ప్రసారమయ్యే షోలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హాజరుకానున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే మహేష్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌లో సందడి చేయనున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Hero Kartikeya: స్టైల్ మార్చిన యంగ్ హీరో.. ఈ సారి అదరగొట్టే ప్లానే వేశాడుగా.. కార్తికేయ న్యూ ఫొటోస్…
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2Zbgrlg
0 Response to "Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. అభిమాన హీరోను బుల్లి తెరపై చూసుకునే చాన్స్.."
Post a Comment