-->
NEET UG Admit Card 2021: నీట్ యూజీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు విడుదల.. డైరెక్ట్ లింక్ ద్వారా ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి..

NEET UG Admit Card 2021: నీట్ యూజీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు విడుదల.. డైరెక్ట్ లింక్ ద్వారా ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి..

Neet

NEET UG Admit Card 2021: నీట్ యూజీ అడ్మిట్ కార్డు విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ అడ్మిట్ కార్డును విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ని సందర్శించి అడ్మిట్ కార్డును (NEET UG అడ్మిట్ కార్డ్ 2021) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్నారు.

నీట్ యుజి పరీక్ష 2021 కోసం దరఖాస్తు ప్రక్రియ 13 జూలై, 2021 న ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి 2021 ఆగస్టు 10 వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. పొరపాట్ల దిద్దుబాటుకై ఆగస్టు 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సమయం ఇచ్చారు. తాజాగా జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష కోసం అడ్మిట్ కార్డు జారీ చేశారు. ఈ పరీక్షను 12 సెప్టెంబర్, 2021 న నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాల కోసం దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడం ఎలా?
1. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో అడ్మిట్ కార్డ్‌పై క్లిక్ చేయండి.

3. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (UG) -2021-అడ్మిట్ కార్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
4. అడిగిన వివరాలను నింపి.. సబ్‌మిట్ కొట్టండి.
5. వివరాలు నమోదు చేసిన తరువాత అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది.
6. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని తదుపరి ఉపయోగం కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి..

పరీక్ష వాయిదా కోసం పిటిషన్.. కొట్టివేత..
సీబీఎస్ఈ కంపార్ట్మెంట్, ప్రైవేట్, కరస్పాండెన్స్ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో.. నీట్ యూజీ 2021 పరీక్షలను కూడా వాయిదా వేయాలి, రీషెడ్యూల్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12 న పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రవేశ పరీక్ష.. ఇతర పరీక్షలకు మధ్య తేడా ఉందంటూ విద్యార్థుల అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘‘నీట్ పరీక్షకు 16 లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతారు. కొంతమంది విద్యార్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని దీనిని వాయిదా వేయలేము.’’ అని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే.. మధ్యప్రాచ్య దేశాలలో నివసిస్తున్న భారతీయ విద్యార్థుల సౌకర్యార్థం కువైట్, దుబాయ్‌లో ఈ కొత్త కేంద్రాలను ప్రారంభించామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది.

Also read:

SBI Apprentice Admit Card 2021: ఎస్‌బీఐ అప్రెంటిస్ ఎగ్గామ్ హాల్ టికెట్ విడుదల.. పూర్తి వివరాలివే..

SBI Offer: మీకు ఈ విషయం తెలుసా?.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. మరో వారం రోజులే గడువు.. పూర్తి వివరాలు మీకోసం..

Agency Rains: నాన్ స్టాఫ్ వర్షాలు.. వరద బీభత్సం. నడుముల్లోతు నీటితో మన్యంలో పరిస్థితి ఆగమ్యగోచరం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3tiZel5

Related Posts

0 Response to "NEET UG Admit Card 2021: నీట్ యూజీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు విడుదల.. డైరెక్ట్ లింక్ ద్వారా ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel