-->
IND vs ENG: ఓవల్‌లో త్రివర్ణ పతాకం ఎగిరింది.. భారత ఖాతాలో 6 రికార్డులను చేర్చిన కోహ్లీసేన.. అవేంటో తెలుసా?

IND vs ENG: ఓవల్‌లో త్రివర్ణ పతాకం ఎగిరింది.. భారత ఖాతాలో 6 రికార్డులను చేర్చిన కోహ్లీసేన.. అవేంటో తెలుసా?

Afp Virat Kohli Oval Test

IND vs ENG: లండన్‌లో చివరి రోజు ఇంగ్లండ్‌పై భారత క్రికెట్ జట్టు మరోసారి విజయం సాధించింది. లండన్‌లో లార్డ్స్ టెస్ట్ చివరి రోజున టీమిండియా ఓడిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. లీడ్స్‌లో ఓటమి భారత జట్టుపై మరోసారి విమర్శలు వచ్చాయి. కానీ, లండన్‌లోనే టీమిండియా పునరాగమనం చేసింది. చివరి రోజున ఇంగ్లండ్‌ను 157 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో దూసుకెళ్లింది. దీనితో, 2007 తర్వాత సిరీస్‌లో ఓటమి ముప్పును భారత్ జయించి, విజయం వైపు నడించింది. సిరీస్‌లో ఐదవది, చివరి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 10 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతుంది.

టీమిండియాకు ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది. కానీ, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 50 సంవత్సరాల తర్వాత ఓవల్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 50 సంవత్సరాల క్రితం 1971 లో భారత జట్టు మొదటిసారిగా ఇంగ్లండ్‌లో ఓవల్‌లో టెస్ట్ గెలిచి సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పుడు మరో విజయం సాధించి గోల్డెన్ జూబ్లీలో టీమిండియా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఓవల్‌లో ఓటమిని అధిగమించింది.

  1. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది 38 వ విజయం. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో దేశాల్లో ఆరో టెస్టులో విజయం సాధించాడు. ఈ విషయంలో కోహ్లీ.. ఇతర ఏ ఆసియా జట్టు కెప్టెన్‌ కూడా సాధించని రికార్డును నెలకొల్పాడు.
  2. ఇంగ్లండ్‌లో భారత్‌కు ఇది 9 వ టెస్టు విజయం. ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్ తర్వాత భారతదేశం అక్కడ 9 టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన నాల్గొవ దేశంగా నిలిచింది.
  3. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఒకే సిరీస్‌లో రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచిన రికార్డును సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకుముందు, కోహ్లీ కెప్టెన్సీలో, 2018-19లో ఆస్ట్రేలియాలో 2-1తో సిరీస్‌ను భారత్ గెలుచుకుంది.
  4. 1986 తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు గెలవడం ఇదే మొదటిసారి. 1986 లో కూడా భారత్ టెస్ట్ సిరీస్ గెలిచింది.
  5. విదేశీ గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో 200 కంటే తక్కువ పరుగులు చేసిన తర్వాత భారత జట్టు టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇది రెండోసారి. అంతకుముందు 2018 లో, భారత జట్టు 2018 లో దక్షిణాఫ్రికాతో జరిగిన జోహన్నెస్‌బర్గ్ టెస్టులో విజయం సాధించింది.
  6. మ్యాచ్ చివరి రోజు, జస్ప్రీత్ బుమ్రా ఒల్లీ పోప్‌ను బౌల్డ్ చేసి టెస్ట్ క్రికెట్‌లో తన 100 వ వికెట్‌ని సాధించాడు. ఈ విధంగా, బుమ్రా 24 టెస్టుల్లో 100 వికెట్లను పూర్తి చేశాడు. దీంతో అత్యంత వేగవంతమైన భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. 25 టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసిన కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు.

Also Read: India Vs England 2021: 24 టెస్టుల్లో 100 వికెట్లతో రికార్డు.. ఓవర్సీస్‌ బౌలర్‌గా పేరు.. కపిల్ దేవ్‌ను వెనక్కు నెట్టిన భారత స్పీడ్‌స్టర్

IND vs ENG: ఓవల్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన కోహ్లీ సేన..!

ICC Player Of Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ రేసులో భారత స్టార్ బౌలర్, ఇంగ్లండ్ కెప్టెన్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3tm8oNN

0 Response to "IND vs ENG: ఓవల్‌లో త్రివర్ణ పతాకం ఎగిరింది.. భారత ఖాతాలో 6 రికార్డులను చేర్చిన కోహ్లీసేన.. అవేంటో తెలుసా?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel