-->
IND vs ENG 4th Test: బ్యాడ్ లైట్ ఎఫెక్ట్.. మూడో రోజు నిలిచిపోయిన ఆట.. భారత్ స్కోర్ 270/3..

IND vs ENG 4th Test: బ్యాడ్ లైట్ ఎఫెక్ట్.. మూడో రోజు నిలిచిపోయిన ఆట.. భారత్ స్కోర్ 270/3..

Ind Vs Eng Match

IND vs ENG 4th Test Day 3 Highlights: బ్యా్డ్ లైట్ ఎఫెక్ట్ కారణంగా భారత్ – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో రోజు ఆట నిలిచిపోయింది. లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో మ్యాచ్‌‌ని నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ముగియడానికి ఇంకా 45 నిమిషాలు ఉండగా.. స్పిన్ బౌలింగ్ వేయడానికి అనుమతిస్తూ మ్యాచ్‌ను కొనసాగించాలని ప్రయత్నించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. మ్యాచ్‌ను ఆపేశారు. మూడో రోజు సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేసిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై 171 పరుగుల లీడ్‌లో ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ అత్యధికంగా 127 పరుగులు(14 ఫోర్లు, 1 సిక్స్) చేయగా.. చటేశ్వర్ పుజారా 61 పరుగులు, కేఎల్ రాహుల్ 46 పరుగులు చేసి ఔట్ అయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(22*), రవీంద్ర జడేజా(9*) రేపు నాలుగో రోజు ఆటను కొనసాగించనున్నారు. కాగా, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లు ఓలీ రాబిన్సన్ 2 వికెట్లు పడగొట్టగా.. జేమ్స్ అండర్సన్ 1 వికెట్ తీసుకున్నాడు. ఇక ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్..
తొలి రోజు మూడవ సెషన్ సమయానికి టీమిండియా ఆలౌట్ అవడంతో.. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే, భారత బౌలర్ల రాణించడంతో కొద్ది సేపట్లోనే 3 వికెట్లు సమర్పించుకుంది ఇంగ్లండ్ టీమ్. తొలిరోజు ఆట ముగిసే సమయానికి రోరీ బర్న్స్, జో రూట్, హసీబ్ హమీద్ వికెట్లు కోల్పోగా.. 53 పరుగులు చేశారు. రెండో రోజు డేవిడ్ మలన్, క్రెయిగ్ ఓవర్టన్ మ్యాచ్‌ను కొనసాగించగా.. మూడవ సెషన్ సమయానికి ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్‌లో 290 పరుగులు చేసి 99 పరుగుల లీడ్‌లో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో పోప్ అద్భుతంగా రాణించాడు. కేవలం 159 బంతుల్లోనే 81 పరుగులు చేసి టెస్ట్ మ్యాచ్‌ను కాస్తా వన్డే మ్యాచ్‌ను తలపించేలా చేశాడు. ఆ తరువాత క్రిస్ వోక్ అంతటిస్థాయిలో ఆడాడు. 50 పరగులు చేసి జట్టు స్కోర్ పెంచేందుకు కృషి చేశాడు. కెప్టెన్ జో రూట్ 21 పరుగులు చేయగా.. మలన్ 31, బెయిర్‌స్టో 37, మోయిన్ 35, పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. బూమ్రా, జడేజా చెరి 2 వికెట్లు తీసుకోగా.. ఠాకూర్, శిరాజ్ చెరో వికెట్ తీశారు.

Also read:

Ritu Varma : వరుస ఆఫర్లు అందుకుంటున్న తెలుగమ్మాయి.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న అందాల రీతూ వర్మకు

Covid-19 vaccination: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యా సంస్థల్లో100 శాతం వ్యాక్సినేష‌న్‌కు మార్గదర్శకాలు..

న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విక్టరీ.. కానీ ఆస్ట్రేలియాకు ఎఫెక్ట్ పడింది..! ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడిన కివీస్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DNCxKp

0 Response to "IND vs ENG 4th Test: బ్యాడ్ లైట్ ఎఫెక్ట్.. మూడో రోజు నిలిచిపోయిన ఆట.. భారత్ స్కోర్ 270/3.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel