-->
Horoscope Today: ఈరోజు వీరికి ఉద్యోగాల్లో అనుకూలం.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. రాశిఫలాలు..

Horoscope Today: ఈరోజు వీరికి ఉద్యోగాల్లో అనుకూలం.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. రాశిఫలాలు..

Horoscope Today

చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకోవాలనుకుంటారు. ఈరోజు సెప్టెంబర్ 13 సోమవారం నాడు చంద్రుడు అంగారకుడి రాశి అయిన వృశ్చికంలో సంచరించనున్నాడు. మరీ ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉండనున్నారో తెలుసుకుందామా.

మేషరాశి..
ఈరోజు వీరికి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులో అకారణంగానే విభేధాలు కలుగుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలలో చిక్కులు ఏర్పడతాయి.
వృషభ రాశి..

ఈరోజు వీరు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవార్తలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో, ఉద్యోగాలల్లో ఒత్తిడి తగ్గుతుంది.
మిథున రాశి..
ఈరోజు వీరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల మద్దతు ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.
కర్కాట రాశి..
ఈరోజు వీరికి బంధువుల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు ఎదుర్కోంటారు. ఉద్యోగంలో సమస్యలు ఏర్పడతాయి..
సింహ రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులు వాయిదా పడతాయి. అనారోగ్య సమస్యలు ఎదుర్కోంటారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి.
కన్య రాశి..
ఈరోజు వీరు ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు.
తుల రాశి..
ఈరోజు వీరు రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగవు. పనులలో ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరు కొత్త పనులు చేపడతారు. సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుణాలు సైత వసూలవుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఫలితాలు మెరుగుపడతాయి.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి ధీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. చేపట్టిన పనులు జరగవు.. దూరప్రయణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగాల విషయంలో నిరాశ ఉంటుంది.
మకర రాశి..
ఈరోజు వీరికి చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొత్త వాహనాలు కొంటారు. దైవ దర్శనాలు ఉంటాయి.
కుంభ రాశి..
ఈరోజు వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం కలుగుతుంది. శుభవార్తలు వింటారు.
మీన రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

Also Read: PM Narendra Modi: తెనాలికి మరో ఖ్యాతి.. ఐరన్ స్క్రాప్‌తో ప్రధాని మోడీ భారీ విగ్రహం.. సూర్య శిల్పశాలలో

Gold Price Today: పసిడి ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2Xn67pL

Related Posts

0 Response to "Horoscope Today: ఈరోజు వీరికి ఉద్యోగాల్లో అనుకూలం.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. రాశిఫలాలు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel