
Horoscope Today: ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. శనివారం రాశిఫలాలు..

Today Rasi Phalalu: ప్రతిరోజూ మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే చాలామంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు జ్యోతిష్యశాస్త్రంపై ఆసక్తి చూపిస్తుంటారు. తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకునేందుకు రాశి ఫలాలను అనుసరిస్తారు. అయితే.. శనివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
మేష రాశి: ఈ రాశి వారు చేపట్టే కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వృషభ రాశి: ఈ రాశి వారికి కష్టాలు ఎదురైనప్పటికీ.. ధైర్యంతో ముందడుగు వేస్తే పనులు పూర్తయ్యే అవకాశముంది. కీలక విషయాల్లో నిర్ణయంపై పెద్దలు, కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటే మంచిది.
మిథున రాశి: ఈ రోజు ఈ వారి అన్ని రంగాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహరాశి: ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కన్య రాశి: ఈ రాశి వారు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ జాగ్రత్తగా ఉంటే పనులను పూర్తవుతాయి. కీలక నిర్ణయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.
తుల రాశి: ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తే కీలకమైన పనులను పూర్తి చేయవచ్చు. సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు అన్ని రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు భవిష్యత్తు ప్రణాళికలతో ముందడుగు వేస్తారు. ఇష్టమైన వారితో, కుటుంబసభ్యులతో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో పనులు చేస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు.
మకర రాశి: ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
కుంభ రాశి: ఈ రాశి వారు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్నచిన్న విషయాలను వదిలివేయాలి.
మీన రాశి: ఈ రాశి వారు చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. జాగ్రత్తలు తీసుకుంటే.. అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారితో గొడవలకు దూరంగా ఉండాలి.
Also Read:
Sai Dharam Tej Health Update Live : మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డుప్రమాదం.. కొనసాగుతున్న చికిత్స ..
Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు.. అతివేగం, ర్యాష్ డ్రైవింగే కారణం..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3yWHDk0
0 Response to "Horoscope Today: ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. శనివారం రాశిఫలాలు.."
Post a Comment