Cyclone Shaheen: తరుముకొస్తున్న షహీన్.. అల్పపీడనంగా మారిన తుఫాన్.. ఆ జిల్లాలకు అలెర్ట్..

Shaheen Cyclone – Updates: గులాబ్ తుఫాన్ భీభత్సం నుంచి కోలుకోకముందే.. తీరంలో షహీన్ తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. గుజరాత్ తీరంలో ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పాకిస్తాన్-మక్రాన్ తీరాల వైపు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. గుజరాత్ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు 2వ తేదీ వరకు అరేబియా సముద్రంలోకి ఎవరూ వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరించింది.
ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తిరిగి ఒడ్డుకు తిరిగి రావాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. గులాబ్ తుపాను ప్రభావం కారణంగా ఈ అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది. గులాబ్ తుఫాను కారణంగా గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరో రెండు రోజులపాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి సూచనలు చేసింది. కాగా.. గుజరాత్‌లో ఇప్పటి వరకు నమోదైన వార్షిక సగటు వర్షపాతంలో 90 శాతం నమోదైందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
రానున్న రెండు రోజులపాటు కోస్తా జిల్లాలైన జామ్‌నగర్, పోర్‌బందర్, ద్వారకా, కచ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతోపాటు పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని.. తీర ప్రాంతాల్లో గాలులు భారీ ఎత్తున వీచే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.
Also Read:
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పండగ సీజన్‌లో జీతం పెంపుతో పాటు డబుల్ బోనస్ రానుందా?
CoWin Certificates: విదేశాలకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. కోవిన్ యాప్‌లో కొత్త ఫీచర్.. అదేంటంటే..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3AYCkCD


0 Response to "Cyclone Shaheen: తరుముకొస్తున్న షహీన్.. అల్పపీడనంగా మారిన తుఫాన్.. ఆ జిల్లాలకు అలెర్ట్.."
Post a Comment