
Crime News: యువతిపై కానిస్టేబుల్ కన్ను.. కూల్ డ్రింక్ ఇచ్చి రెండేళ్లుగా అఘాయిత్యం.. చివరకు కొడుకుతో కలిసి..

Woman Raped by Constable: అతనోక ట్రాఫిక్ కానిస్టేబుల్.. చట్టాల గురించి.. సమాజం గురించి బాగా తెలుసు.. అయినా.. మేనకోడలితో పాశవికంగా ప్రవర్తించాడు. కూతురిలా చూసుకోవాల్సిన సొంత మేనమామే.. ఆ యువతి పాలిట శాపంలా మారాడు. యువతిపై కన్నేసిన మేనమామ.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీయించి.. బ్లాక్‌మెయిల్ చేస్తూ రెండేళ్లుగా యువతిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చివరకు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేధింపులు తట్టుకోలేని ఆ యువతి గంగా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. గత రెండెళ్లుగా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ పదేపదే అత్యాచారానికి పాల్పడుతుండటం, అదేవిధంగా అతని కొడుకు వేధింపులు కూడా పెరగడంతో 25 ఏళ్ల యువతి ఆదివారం గంగలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాపూర్ జిల్లాకు చెందిన యువతి.. ఆమె కుటుంబాన్ని.. మామ అయిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ 2019 జనవరిలో జరిగిన కుంభానికిఅలహాబాద్‌కు పిలిపించాడు. ఈ క్రమంలో యువతిపై కన్నేసిన మామ.. ఓ రోజు హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ యువతికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బ్లాక్‌మెయిల్ చేయడానికి ఓ వీడియో కూడా తీశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ వీడియోతో మామ తనను రెండేళ్లు బ్లాక్‌మెయిల్ చేస్తూ.. అలహాబాద్, కాన్పూర్‌లో అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె పేర్కొంది. గర్భవతి అని తెలుసుకున్న అనంతరం గర్భస్రావం కావడానికి ఒక మాత్ర కూడా ఇచ్చాడని ఆమె పేర్కొంది. ఈ క్రమంలో నిందితుడు, అతని కుమారుడు ఆదివారం మళ్లీ కాన్పూర్‌కి పిలిపించి గదికి తీసుకెళ్లారని పేర్కొంది. లైంగికంగా వేధిస్తూ అక్కడ కూడా మరొక వీడియో తీశారని మహిళ పేర్కొంది.
ఈ విషయాన్ని చెబితే చంపుతామని తీవ్రంగా కొట్టారని తెలిపింది. చివరకు వారి నుంచి తప్పించుకున్న మహిళ.. పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి నదిలోకి దూకినట్లు మీర్జాపూర్ డీసీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు. అక్కడున్న గజ ఈతగాళ్లు, సిబ్బంది సహాయంతో ఆమెను కాపాడినట్లు డీసీపీ తెలిపారు. అనంతరం మహిళ ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్, అతని కుమారుడిపై కేసు నమోదు చేశామని.. తెలిపారు. మహిళకు వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించామని డీసీపీ వెల్లడించారు.
Also Read:
Kidnap and Rape: రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలిక కిడ్నాప్.. ఆపై రైల్వే క్వార్టర్స్‌లోకి లాక్కెళ్లి..
Mumbai: మొబైల్ గేమ్ ఆడే విషయంలో ఘర్షణ.. తమ్ముడి ముందే ఎలుకల మందు తిని ప్రాణాలు కోల్పోయింది..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lj6Z6V
0 Response to "Crime News: యువతిపై కానిస్టేబుల్ కన్ను.. కూల్ డ్రింక్ ఇచ్చి రెండేళ్లుగా అఘాయిత్యం.. చివరకు కొడుకుతో కలిసి.."
Post a Comment