-->
Bigg Boss 5 Telugu: యాంకర్‌ రవి బిగ్‌బాస్‌ షో కోసం వారానికి అంత తీసుకుంటున్నాడా.? క్రేజ్‌ మాములుగా లేదుగా..

Bigg Boss 5 Telugu: యాంకర్‌ రవి బిగ్‌బాస్‌ షో కోసం వారానికి అంత తీసుకుంటున్నాడా.? క్రేజ్‌ మాములుగా లేదుగా..

Anchor Ravi

Bigg Boss 5 Telugu: ఆశ్చర్యాలకు, అద్భుతాలకు, ఎంటర్‌టైన్‌మెంట్‌ కేరాఫ్‌ అడ్రస్‌ బిగ్‌బాస్‌ రియాలిటీ షో. సీజన్‌ 5 మొదలై నాలుగు రోజులు కూడా గడవలేదు అప్పుడే షో ఆసక్తికరంగా మారింది. హౌజ్‌మేట్స్‌ మధ్య అప్పుడే గొడవలు కూడా ప్రారంభమయ్యాయి. వారు గొడవ పడుతూ వీక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్నారు. ఇక ప్రేక్షకులకు ఎక్కడలేని వినోదాన్ని అందించే బిగ్‌బాస్‌ షోలో ప్రతీ అంశం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే హౌజ్ మేట్స్‌ రెమ్యునరేషన్‌కు సంబంధించిన నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్‌ చేస్తూనే ఉంటుంది. ఈ కంటెస్టెంట్‌ ఇంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడని, పలానా యాక్టర్‌ వారానికి ఇన్ని రూ. లక్షలు తీసుకుంటున్నాడని గాసిప్‌లు వస్తుంటాయి.

ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్‌ కంటెస్టంట్‌లో అందరి కంటే ఎక్కువగా క్రేజ్‌ ఉన్న యాంకర్‌ రవి రెమ్యునరేషన్‌ విషయంలో ఓ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చిన్న యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన రవి.. ఏకంగా సినిమాలో హీరోగా కూడా నటించాడు. రకరకాల ప్రోగ్రామ్‌లతో రెండు చేతుల సంపాదిస్తున్న రవి ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌజ్‌లో సందడి చేస్తున్నాడు. అయితే రవిని బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి తీసుకురావడానికి షో నిర్వాహకులు భారీగా అప్పజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

రవి ఇందుకోసం వారానికి గాను ఏకంగా రూ. 3 నుంచి రూ. 5 లక్షలు తీసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. రవి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వచ్చే కంటే ముందు పలు షోలతో పాటు ప్రాజెక్టులకు ఓకే చెప్పాడని, కానీ బిగ్‌బాస్‌ ఆఫర్‌తో వాటిని మధ్యలోనే వదిలేసి వచ్చాడని అందుకే అంతలా అప్పజెప్పడానికి నిర్వాహకులు ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. మరి రవి బుల్లి తెర ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి.

Also Read: Telangana Weather Report: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. వాతావరణ కేంద్రం కీలక ప్రకటన..

Mahesh Babu : మహేష్ బాబును మీట్ అయిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.. వైరల్ అవుతున్న వీడియో..

బిగ్ బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే.? హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3trnd1h

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: యాంకర్‌ రవి బిగ్‌బాస్‌ షో కోసం వారానికి అంత తీసుకుంటున్నాడా.? క్రేజ్‌ మాములుగా లేదుగా.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel